నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవత సహిత నాగ పున:ప్రతిష్ట మహోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రామస్వామి యాదవ్, లక్ష్మీనారాయణ గౌడ్, రాజేశ్వరమ్మ,మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిరియాల రాఘవరావు, రమణమూర్తి , కరుణాకర్ గౌడ్,మల్లారెడ్డి,పద్మారావు, లక్ష్మీనారాయణ రెడ్డి, శ్రీనివాసరావు, శ్రీనివాస్ గౌడ్, కాశీనాథ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.