శేరిలింగంపల్లి, డిసెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్ లో స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో శ్రీ సాయి మాస్టర్ సత్సంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను DRDO చైర్మన్, భారత రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి, స్టార్ హాస్పిటల్ డాక్టర్ గూడపటి రమేష్, కార్పొరేటర్ నార్నె శ్రీనివాస తో కలసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ పేద ప్రజలు ఈ వైద్య శిబిరాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదలకు సేవ చేసేందుకు ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది , కాలనీ వాసులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.