వేడుకగా జనసేనాని జన్మదిన వేడుక

నమస్తే శేరిలింగంపల్లి: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నియోజక వర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి నేతృత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గ ఇంఛార్జి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, 122 డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ సాహు ఆధ్వర్యంలో విశిష్ట అతిథిగా హజరై దీనబంధు కాలనీ లో బీద, పారిశుధ్య కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు.

కేక్ కట్ చేస్తూ…

హైదర్ నగర్ 123 డివిజన్ అధ్యక్షులు సిరా రాజేష్, జల్సా యూత్ సంయుక్తంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను తెలంగాణ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే విధంగా పార్టీని గ్రామ స్థాయి లో బలోపేతం చేసేందుకు మరింతగా కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ వివిధ డివిజన్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, వీర మహిళలు, జన సైనికులు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here