పీజేఆర్‌కు ఘ‌న నివాళి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాజీ సీఎల్పీ లీడర్ దివంగత పి.జనార్దన్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని హ‌ఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారంలో ఉన్న పీజేఆర్ విగ్రహానికి ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపేటి జైపాల్ తో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీజేఆర్‌ తో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తాము రాజకీయంగా ఎదగడానికి ముఖ్య నాయకుడు పీజేఆర్ అని అన్నారు.

పీజేఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పిస్తున్న జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు టీ.కృష్ణ, టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి, ఊరిటి వెంకట్ రావు, శేఖర్ ముదిరాజ్, కట్ల శేఖర్ రెడ్డి, గఫర్, నర్సింహ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, కాటికే రాజు, సౌందర్య రాజన్, సుదర్శన్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు నాగేష్ నాయక్, అల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మారెళ్ల శ్రీనివాస్, సంగారెడ్డి, రాజు ముదిరాజ్, చిన్న, మురళి, ప్రవీణ్, సుధాకర్, కృష్ణ, యలమంచి ఉదయ్ కిరణ్, రవి కుమార్ గౌడ్, రామచందర్ గౌడ్, కార్తీక్ గౌడ్, లక్ష్మణ్, రూబిన్, మహేష్, గోపాల్ గౌడ్, యాదయ్య, వెంకట్ రెడ్డి, కంది చిన్న, ప్రవీణ్, రాజు, బుజేందర్, కన్నా, ఇస్మాయిల్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాయి కిషోర్, నందు, సురేష్, నవీన్, సత్యరాజ్, అశోక్, నర్సింహ, వినోద్, సింహాచలం, శ్రీనివాస్ ముదిరాజ, కృష్ణ రెడ్డి, శశిధర్, శేఖర్, ప్రదీప్, చారి, సాయి, శంకర్ గౌడ్, జావీద్, భరత్, మహిళలు పార్వతి, ఎం.జయ, స్వాతి రెడ్డి, విజయలక్ష్మి, శాంత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here