శేరిలింగంపల్లి, డిసెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ కమాన్ నుండి రూ. 1 కోటి అంచనావ్యయంతో చేపడుతున్న రోడ్డు డివైడర్ ( విభాగిని) పనులను GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ట్రాఫిక్ అధికారులతో కలిసి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేసేందుకు వీలుగా రోడ్డు మధ్యలో డివైడర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని , త్వరితగతిన పనులు పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో GHMC EE గోవర్దన్, వర్క్ ఇన్స్పెక్టర్ గురువా రెడ్డి, నాయకులు సంజీవ రెడ్డి, నాయినేనీ చంద్రకాంత్ రావు, పురెందర్ రెడ్డి, చంద్రమోహన్ సాగర్, శివ సాగర్, నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.