శేరిలింగంపల్లి, డిసెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): AIFDS గ్రేటర్ హైదరాబాద్ కమిటి ఆధ్వర్యంలో జనవరి 6,7 తేదీలలో తాండ్ర కుమార్ మెమోరియల్ క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని AIFDS గ్రేటర్ కమిటీ కన్వీనర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా AIFDS గ్రేటర్ కమిటి ఆధ్వర్యంలో శ్రీకాంత్, అరుణ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి చేతుల మీదుగా పోస్టర్ ను ఆవిష్కరించారు. 6,7, తేదీలలో పీజేఆర్ స్టేడియంలో జరిగే ఆటలపోటీలను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.