శేరిలింగంపల్లి, డిసెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ సమావేశం గౌరవాధ్యక్షుడు C V రావు అధ్యక్షతన సమాఖ్య కార్యాలయం అమీర్ పేటలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంఘంపై కొంతమంది వారి స్వార్థపూరిత ఆలోచన తో వేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సందర్భంగా రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ని అభినందించి శాలువాలతో సత్కరించారు. అదేవిధంగా మెంబర్షిప్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్య , తెలంగాణ గౌరవ అధ్యక్షుడు సివి రావు, అధ్యక్షుడు ఆరెకపూడి గాంధీ, ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, పునుకొల్లు నాగభూషణం, తాళ్లూరు చంద్రమౌళి, పోలవరపు శ్రీనివాస ప్రసాద్, పాతూరు వెంకట్రావు, పొట్లూరు పాండురంగారావు, తాళ్లూరి జీవన్ కుమార్, చాపరాల శ్రీనివాస దాసు, పల్లెంపాటి శివన్నారాయణ, ముప్పనేని అప్పారావు, కానూరి ఆంజనేయవర ప్రసాద్, కొల్లి నాగేంద్ర రావు, కాజా కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.