శేరిలింగంపల్లి, డిసెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2025 క్యాలెండర్ ను శేరిలింగంపల్లి నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలలో సైతం చాలా చురుకుగా పాల్గొంటున్నారని యలమంచి ఉదయ్ కిరణ్ కి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. సమాజం కోసం, సామాజిక సేవలో ఎల్లప్పుడూ యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్టు సభ్యులు ముందుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యలమంచి ఉదయ్ కిరణ్ ట్రస్ట్ సభ్యులు, టీమ్ యలమంచి సభ్యులు, నియోజకవర్గ నాయకులు , నాయకులు, మియాపూర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాండ్ర రాంచందర్, పద్మిని, సత్యారెడ్డి, విజయ్, వినోద్, కామినేని శ్రీనివాస్, నాని, శివ, సింహాచలం, గురువులు, సుబ్బరాయుడు, చిరంజీవి, బాల మురళి, శేషు, శ్రీరాములు, వీజేఆర్ సుబ్బారెడ్డి, డి రమణ, నాగరాజు, నాయుడు, సుబ్బారెడ్డి, శ్రీకాంత్, పవన్, వంశీ, ప్రవీణ్, చారి, సాయి, నవీన్, శేఖర్, వినోద్, శ్రీకాంత్ చౌదరి, కృష్ణ రెడ్డి, చిరంజీవి, వరుణ్, శ్రేయాస్, వెంకట్రావు, కేఎల్ నాయుడు, మధు తదితరులు పాల్గొన్నారు.