శేరిలింగంపల్లి, డిసెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ సీఎల్పీ నేత, మాజీ మంత్రి పీజేఆర్ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ లోని ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎంఎల్సీ బొమ్మ మహేష్ కుమార్, ఎంఎల్సీ బల్మూరి వెంకట్, పీజేఆర్ కుమార్తె విజయ రెడ్డితో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి, వివేకానందన్ నగర్ డివిజన్ అధ్యక్షులు బాష్పాల యాదగిరి, కార్తీక్ గౌడ్, సౌందర్య రాజన్, లక్ష్మణ్, మూర్తి, భరత్ తదితరులు పాల్గొన్నారు.