శేరిలింగంపల్లి, డిసెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ సీఎల్‌పీ నేత, మాజీ మంత్రి పీజేఆర్‌కు ఆయన నివాసంలో హఫీజ్ పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలింగ్ గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ పీజేఆర్ పేదల పక్షపాతి అని అన్నారు. ఆయన ఎప్పుడూ సమాజ సేవ కోసం ఎంతో తాపత్రయ పడ్డారని, ఒక గొప్ప నేత అని కొనియాడారు.