శేరిలింగంపల్లి, డిసెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): క్రిస్టమస్ పర్వదిన సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని పాస్టర్లు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వామి, సోలమన్ రాజు, విజయ్ కుమార్, వందన్ కుమార్, ప్రశాంత్ కుమార్, బిషప్. ఫిలిప్, పాస్టర్ సుకుమార్, పాస్టర్ రాణి, పాస్టర్ జాన్ రాజు, పాస్టర్ విజయరాజు, పాస్టర్ శేఖర్, పాస్టర్ ఫిలిప్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.