- మియాపూర్ డివిజన్లో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటన
- వినాయక చవితి ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని గురునాథం చెరువు బేబీ పౌండ్ ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డీసీ మోహన్ రెడ్డి, పలు శాఖల సంబంధిత అధికారులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొలనును తొందరగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. చెరువుల సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, అదేవిధంగా మరిన్ని చెరువుల సుందరీకరణకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ముందుకు రావాలని ఆయా సంస్థల ప్రతినిధులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ నాగిరెడ్డి, వైద్యాధికారి రవి, పలు శాఖల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.