ఘ‌నంగా మ‌దీనాగూడ నాభిశిల ప్ర‌తిష్టాపన మహోత్సవం

శేరిలింగంప‌ల్లి, మే 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ‌ గ్రామంలో జరిగిన నాభిశిల (బొడ్రాయి) ప్ర‌తిష్టాపన మహోత్సవం కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్, దాత్రి నాథ్ గౌడ్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో బొడ్రాయిని పూజించే సంప్రదాయం మన పూర్వీకుల నుంచి వస్తుందన్నారు. గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని , ఎలాంటి అశుభాలు జర‌గకుండా ఉండాలని పూర్వకాలంలో మన పెద్దలు బొడ్రాయి ని ప్రతిష్టించే వాళ్ల‌ని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. అమ్మ వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అమ్మ వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్, దాత్రి నాథ్ గౌడ్, యాదగిరి, జనార్దన్, మల్లేష్, మల్లేష్ యాదవ్, కృష్ణ, నరేందర్ బల్లా, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here