- కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి వినతి పత్రం అందజేత
నమస్తే శేరిలింగంపల్లి: నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి ఆ కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కాలనీలోని ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్లు, కాలనీలో మురికి కాలువలు నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుందనీ అన్నారు. దోమలు ప్రబలి విష జ్వరాలు కగులుతున్నాయన్నారు. ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ వల్ల కరెంటు సమస్యలను అధికంగా ఉంద న్నారు. వీధిలైట్లు లేక కాలనీలో అంత చీకటిగా మారుతుందని తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులు కాలనీకి చెత్త చెదారం పేరుకుపోవడం కాలనీలో మౌలిక వసతులు కల్పించాలనీ, అనేక సమస్యల మీద కాలనీలో ఉన్న సమస్యల పైన కార్పొరేటర్ దృష్టి తీసుకెళ్లడం జరిగింది. కార్పొరేటర్ మాట్లాడుతూ త్వరలోనే నేతాజీ నగర్ లో నేలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాయుడు, మణికంఠ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. హామీలు పరిష్కరిస్తామని తెలిపిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి కాలనీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.