శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎనక్లేవ్ కాలనీ నుండి బొల్లారం మెయిన్ రోడ్డు వరకు రూ 1 కోటి 50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టిన వరద నీటి కాలువ నిర్మాణం పనులను GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వరద నీరు కాల్వ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని ,రాబోయే వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని పనులలో జాప్యం లేకుండా , వర్షాకాలంలోపు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు DE దుర్గా ప్రసాద్, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మర్రపు గంగాధర్ రావు, తిరుపతి, శ్రీనివాస్ చౌదరి, నరేష్ నాయక్, శివ ముదిరాజు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.