శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపదలో ఉన్న బాధితులకు అండగా నిలుస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందిన పలువురు బాధితులకు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు అయిన రూ.2,25,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను నియోజకవర్గ నాయకులతో కలిసి బాధితులకు జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు ముకన్న, వెంకన్న, కిరణ్, ప్రసాద్, విఘ్నేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.