పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గాంధీ

  • 520 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ నిధులు మంజూరు
  • రూ. 5కోట్ల 20 లక్షల 60వేల 320లు మంజూరు.. చెక్కుల రూపేణా అందజేత 

నమస్తే శేరిలింగంపల్లి: కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం నుంచి లబ్ధిదారులకు నిధులు మంజూరయ్యాయి. శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్ ,భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని 520 మంది లబ్ధిదారులకు రూ. 5కోట్ల 20 లక్షల 60వేల 320లు మంజూరవగా ఈ ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చెక్కుల రూపేణా లబ్ధిదారులకు అందజేశారు. మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి చెక్కులు అందజేసి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్న లాగా నిలుస్తారని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు.

నిరుపేదల అడా బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా, మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టారన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ దిలీప్, ఆర్ ఐ రాంబాబు , మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here