బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి హరీష్ రావు

  • దేశంలో కెల్లా తెలంగాణలోనే అత్యధికం ఆశా వర్కర్ల వేతనం
  • బస్తీ దవాఖానల ఏర్పాటుతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో తగ్గిన ఓపీ శాతం
  • వెల్లడించిన మంత్రి
  • నూతనంగా ఎంపికైన 1560 మంది ఆశావర్కర్లకు నియామక పత్రాలు అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని ఆర్థిక , వైద్య, ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని శిల్పకళావేదికలో కొత్తగా ఎంపికైన 1560 మంది ఆశావర్కర్లకు నియామక పత్రాలను అందజేశారు. మంత్రులు మహ్మద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి నియామక పత్రాలు అందచేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఒకప్పుడు ఏ రోగం వచ్చినా గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వెళ్లేవాళ్లమని.. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని.. దీంతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో ఓపీ శాతం తగ్గిందని చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మూడు ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్బంగా మంత్రి చెప్పారు. కేసీఆర్‌ కిట్‌తో మాతా శిశు మరణాలను తగ్గించామని, పైసా ఖర్చు లేకుండా టీ-డయాగ్నొస్టిక్స్‌లో ఉచితంగా 134 పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. ఆశావర్కర్ల సేవలు మరచిపోలేనివన్నారు. నూతనంగా ఎంపికైన ఆశవర్కర్ల కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని ఆరోగ్య సేవలు దేశానికే ఆదర్శమని, ప్రజలు ప్రభుత్వ దవాఖానలవైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. కరోనా సమయంలో ఆశావర్కర్ల సేవలు విశేషమైనవని తెలిపారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లకు రూ.9,750 వేతనం ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి తన్నీరు హరీష్ రావు లు వైద్యరంగం అభివృద్ధి కి ఎనలేని కృషి చేస్తున్నారని, వైద్య రంగం అభివృద్ధి కి పెద్ద పీట వేస్తున్నారని, కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దారని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here