- గీతాంజలి స్కూల్ ప్రిన్సిపాల్ గాయత్రీ
- విద్యార్థులతో కలిసి జేఎన్టీయూలోనీ ఫ్లోరిస్ట్స్ బేకరీల సందర్శన
నమస్తే శేరిలింగంపల్లి: నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, వారు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తున్నామని, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని గీతాంజలి ఇంటర్ నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ గాయత్రీ అన్నారు. బౌరంపేటలోని తమ పాఠశాల విద్యార్థుల కోసం ఓ కార్యక్రమం నిర్వహించింది ఆ స్కూల్. ఈ నేపథ్యంలో జేెఎన్టీయూలోని ఫ్లోరిస్ట్స్ బేకరీలను సందర్శించేందుకు విద్యార్థులను తీసుకెళ్లారు ఉపాధ్యాయులు.
అక్కడి వాతావరణం వారిని మైమరపింపజేసింది. రంగురంగుల పూలు.. రకరకాల కలర్స్ ను చూసి ఆనందపడ్డారు. అనంతరం బేకరి ఉత్పత్తులు ఎలా తయారు వివరంగా చిన్నారులకు తెలియజేశారు ఉపాధ్యాయులు. విద్యతోపాటు ఇలాంటి వినూత్న మైన కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతాయని, విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రామాన్ని నిర్వహించిన ప్రిన్సిపాల్ గాయత్రి, ఉపాధ్యాయుల బృందాన్ని సంస్థ చైర్మన్ పి. శ్రీనివాస్ రావు అభినందించారు. విద్యార్థుల వికాసానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడుతాయని పేర్కొన్నారు.