ప్రతి విద్యార్థికి సీట్ ఇవ్వాలి

  • ఏ ఐ ఫ్ డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని చెప్పి.. ప్రయివేట్ విద్యకు రెడ్ కార్పేట్ వేసి స్వాగతం పలుకుతున్నారని ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పల్లె మురళి, గడ్డం నాగార్జున అన్నారు. ఈ ఏడాది సాంఘిక సంక్షేమ హాస్టల్లో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి పేద విద్యార్థికి సీటు కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ.. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఓ ఎస్ డి చంద్రకాంత్ కి అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మెమోరాండమ్ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టల్లో ఒక విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నా అని చెప్పినా సీఎం కేసిఆర్.. ఇప్పుడు ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్లో కనీస నిత్యావసర వసతులు కరువయ్యాయని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లలో వసతి లేకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నారని, సరైన పడక గదులు లేక అవస్థలు పడుతున్నారని వీటికి ఏం చెబుతారని ప్రశ్నించారు. వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ టీచింగ్ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు నోటు పుస్తకాలు వెంటనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఫ్ డిఎస్ మాస్ సావిత్రి పేరెంట్స్ కమిటీ చైర్మన్ సారయ్య పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here