సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఓపెన్ హౌస్ విజిట్

  • POCSO, ACT, భరోసా కేంద్రాలు, బాలమిత్ర పై అవగాహన

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఆదేశాల మేరకు (W&CSW) విమెన్ అండ్ చైల్డ్ & సేఫ్టీ వింగ్ డీసీపీ నితికా పంత్, ఐపీఎస్., ఆధ్వర్యంలో వివిధ పాఠశాల విద్యార్థినులకు ఓపెన్ హౌస్ విజిట్ ఏర్పాటు చేషారు.

ఈ సందర్భంగా షి టీమ్ ఇన్ స్పెక్టర్ వేణు మాధవ్ మాట్లాడుతూ.. ఓపెన్ హౌస్ విజిట్ లో భాగంగా వివిధ కళాశాలకు చెందిన 300 మంది విద్యార్థినులకు అవగాహన కల్పించమన్నారు.

విద్యార్థినిలకు షీ టీమ్ అంటే ఏమిటి? ఎలా పని చేస్తుంది? వారికి ఎలా ఉపయోగపడుతుంది, విమెన్ పోలీస్ స్టేషన్ పనితీరు, భరోసా కేంద్రాలను చూపిస్తూ వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించమన్నారు. విద్యార్థినిలకు POCSO, Good Touch & Bad Touch, Abnormal behaviour of Strangers, How to be at Home & Outside, బాలమిత్ర కు సంబంధించిన అంశాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించమన్నారు. ముఖ్యంగా విమెన్ సేఫ్టీ, విమెన్ సెక్యూరిటీ, చైల్డ్ సేఫ్టీ వంటి అంశాలపై అవగాహన కల్పించామన్నారు. మహిళల అక్రమ రవాణా, గృహ హింస, Dial 100, భరోసా కౌన్సెలింగ్ కేంద్రం, అపరిచితుల నుండి పిల్లలకు భద్రతా చర్యలు పై అవగాహన కల్పించామన్నారు.

ఆడియో & వీడియో విజువల్స్ ద్వారా సులభంగా అర్థమయ్యే విధంగా అవగహనా కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విమెన్ అండ్ చైల్డ్ & సేఫ్టీ వింగ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశం, ఇన్ స్పెక్టర్ వేణుమాధవ్, విమెన్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ సునిత, భరోసా కేంద్రం ప్రతినిధులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here