చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించాలి

  • ప్రజా ఆశీర్వద యాత్రలో మొవ్వ సత్యనారాయణ
ఆశీర్వద యాత్రకు ముందు…శివాలయంలో పూజలు

నమస్తే శేరిలింగంపల్లి:భారతీయ జనతా పార్టీ ప్రజా ఆశీర్వాద యాత్రను మొవ్వా సత్యనారాయణ, కొరడాల నరేష్ , ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మియాపూర్ 108వ డివిజన్ మార్కెట్ శివాలయంలో పూజా కార్యక్రమం అనంతరం పాదయాత్రను ప్రారంభించారు.

ఈ పాదయాత్రలో భాగంగా మియాపూర్ న్యూ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్లారు. డ్రైనేజీ, వాటర్, దోమల బెడద తదితర అంశాలను స్థానికులు వారి దృష్టికి తీసుకువచ్చారు. పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, వేల కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామని చెబుతున్న అధికార పార్టీ నాయకులు గల్లీల్లో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయని, అధికారులను వేసుకువచ్చి హడావుడి చేస్తే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని అన్నారు. మియాపూర్ డివిజన్ లో అడుగడుగునా సమస్యలు ఉన్నాయని, బీఆర్ ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here