- బిజెపి ప్రజా ఆశీర్వాద యాత్రలో మొవ్వ సత్యనారాయణ
- చిత్తశుద్ధి ఉంటే సమస్యలు పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులకు సవాల్
నమస్తే శేరిలింగంపల్లి: అధికార పార్టీ నాయకులు గల్లీల్లో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయని, అధికారులను వేసుకువచ్చి హడావుడి చేస్తే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని మొవ్వా సత్యనారాయణ అన్నారు. ఆయనతో పాటు, కొరడాల నరేష్ , ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. మియాపూర్ 108వ డివిజన్ అంగార రెస్టారెంట్ నుంచి ప్రారంభించి దత్తసాయి ఎంక్లేవ్, శ్రీ రంగాపురం, అరబిందో కాలనీ, బాలాజీ నగర్ మీదగా కొనసాగించారు. ఈ పాదయాత్రలో భాగంగా ఇంటింటికి తిరిగుతూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్లారు.
త్రాగునీటి సమస్యలు, దోమల బెడద, కుక్కల బెడద, మురికి చెరువుల కంపు, అస్తవస్థమైన రోడ్లు తదితర అంశాలను స్థానికులు వారి దృష్టికి తీసుకువచ్చారు. పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మొవ్వా సత్యనారాయణ గారు మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, వేల కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదని చెప్పారు.
మియాపూర్ డివిజన్ లో అడుగడుగునా సమస్యలు ఉన్నాయని, బీఆర్ ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమదృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.