నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కి చెందిన కె. గిరిజ అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల 20 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ మంజూరి పత్రాన్ని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలిపారు. వైద్య చికిత్సకి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లకు బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు జేరిపాటి రామరాజ, హరీష్ రెడ్డి, నరేందర్ బల్లా, అమిత్, శివ పాల్గొన్నారు.