శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో శేరిలింగంపల్లి డివిజన్ లో నెలకొన్న స్ట్రీట్ లైట్స్, పలు సమస్యలపై మేయర్ ద్వారా అధికారులను ప్రశ్నిస్తూ శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రసంగించారు.