శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జి వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి (50) స్పృహ తప్పి పడి ఉన్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా అతను చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అతని వివరాలు తెలియరాలేదని, బహుశా అనారోగ్యం కారణంగా అలా స్పృహ తప్పి పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృత దేహాన్ని ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని సూచించారు.