శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి జిహెచ్ఎంసీ వార్డ్ కార్యాలయంలో అమెజాన్ కంపెనీ సహకారంతో సుమారు 200 మంది పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు నగర పరిశుభ్రత కోసం రోజూ తెల్లవారుజామున నుంచి కష్టపడుతున్నారు. వారివల్లే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటున్నాయి. పారిశుధ్య కార్మికులు ఎంతో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్నారని, ప్రజలకు సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హనుమంత్ నాయక్, సుమన్, రాజు, శ్రీను, యాదయ్య, గోవింద్, జిహెచ్ఎంసీ సిబ్బంది భారత, కిస్తయ్య, మల్లేష్,,అమెజాన్ సంస్థ ప్రతినిధులు, పారిశుధ్య కార్మికులు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.