ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ : మూల అనిల్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సామాజిక న్యాయ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు నక్క శివ కుమార్ ఆధ్వర్యంలో ఖాజాగూడ మెయిన్ రోడ్డులో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. మధుర నగర్ లో బీజేపీ నాయకులు పెద్దగొని సతీష్ గౌడ్ నివాసంలో సహా పంక్తీ భోజనం చేపట్టారు. అనంతరం బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్ మాట్లాడుతూ.. గత 43 సంవత్సరాలుగా భారత దేశ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ, దేశ వ్యతిరేక శక్తులపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు.

సామాజిక న్యాయ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా నాయకులు పెద్దగొని సతీష్ గౌడ్ నివాసంలో సహా పంక్తీ భోజనం

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ కార్యదర్శి మూల అనిల్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి , బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖైతాపురం జితేందర్, బీజేపి ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అమర్ యాదవ్, బీజేపి డివిజన్ ఉపాధ్యక్షులు ఆర్.వెంకటేష్, అంబటి అశోక్, దయాకర్, తిరుపతి, బీజేవైఎం డివిజన్ ప్రధాన కార్యదర్శి సామ్రాట్ గౌడ్, బీజేవైఎం డివిజన్ ఉపాధ్యక్షులు మున్నుర్ సాయి, ఆర్. విష్ణు, రాఘవేందర్ ముదిరాజ్, బీజేవైఎం డివిజన్ కార్యదర్శి సంకేష్ సింగ్, బీజేపీ నాయకులు ఆర్.ప్రవీణ్ కుమార్ , ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖాజాగూడ మెయిన్ రోడ్డులో స్వచ్ఛతా కార్యక్రమం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here