గొప్పలు చెప్పడంలోనే ముందు.. సమస్యలు తీర్చడంలో విఫలం

  • బీఆర్ఎస్ పనితీరుపై బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ విమర్శ
  • 6వ రోజుకు చేరిన రవన్న ప్రజా యాత్ర
రోడ్లపై పారుతున్న మురుగును పరిశీలిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : వీధి, వీధి.. వాడ, వాడ సమస్యలతో తల్లడిగిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. 6 వ రోజు ఆల్విన్ కాలనీ డివిజన్ సిక్కుల బస్తి, పీజేఆర్ నగర్ లో రవన్న ప్రజా యాత్ర 6 వ రోజుకు చేరుకుంది. మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లూరి రామరాజు, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, కుమార్ యాదవ్, రవీందర్ రావు, మణి భూషణ్, కమలాకర్ రెడ్డి, వేణు యాదవ్, నర్సింగ్ యాదవ్ , నరసింహ చారి, రాజు, రఘు పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడంలో ముందు.. సమస్యలు తీర్చడంలో వెనక అన్నట్లు ఉందని అన్నారు. ప్రతి వీధిలో, ప్రతి వాడలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు తప్ప అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ఈ పాదయాత్రలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిపై దృష్టి సారిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, అభివృద్ధి మోర్చా నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు.

సుత్తే చేతబట్టి..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here