శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కి బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరించే మహా నాయకుడు తెలంగాణ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అని అన్నారు. వికారాబాద్ జిల్లాలో ప్రతినిత్యం ప్రజల కష్టనష్టాలలో పాలుపంచుకుంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న గొప్ప నాయకుడు గడ్డం ప్రసాద్ అని, ఆయన మునుముందు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు. కార్యక్రమంలో జంగయ్య యాదవ్, అభిమానులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.