శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): సామాజిక సంఘ సేవకుడు, వ్యాపార వేత్త, సాయి బాలాజీ గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ అట్టేపల్లి రామప్రభు 50వ జన్మదినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ ఆయన నివాసంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అట్టిపల్లి పురుషోత్తం, కిరణ్ యాదవ్, రామకృష్ణ గౌడ్, రాజశేఖర్, దేవేందర్ దాస్, కృపాకర్, రాజ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.