- ఆకట్టుకున్న విద్య వాణి ‘విజ్ఞానం’
- తమ పిల్లల ప్రదర్శనలు చూసి పరవశించిపోయిన తల్లిదండ్రులు
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలోని విద్య వాణి హై స్కూల్ నిర్వహించిన క్వస్ట్ ఎక్స్ పో 2023 విజ్ఞానశాస్త్ర ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య వాణి హై స్కూల్ లో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శన విద్యార్థులలో దాగున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు దోహద పడుతుందని తెలిపారు. విద్యార్థులు చేసిన సాంకేతిక , సాంస్కృతిక, పర్యావరణ ప్రాజెక్టులను తిలకించి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి ఎంతగానో ప్రశంసించారు. అంతేకాక ప్రదర్శనకు విచ్చేసిన తల్లిదండ్రులు, తమ పిల్లలు చేసిన ప్రాజెక్టులను చూసి పరవశించి పోయారు. ఈ కార్యక్రమంలో విద్య వాణి హై స్కూల్ పాఠశాల యాజమాన్యం చైర్మన్ అనిల్ కుమార్, ఉష రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ , హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వాలా హరీష్ పాల్గొన్నారు.