ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

  • రూ. 6 లక్షల 50 వేలు మంజూరు
  • బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
బాధిత కుటుంబ సభ్యులకు సీఎంఆర్ ఎఫ్ – ఎల్ఓసి పత్రాలను అందజేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: స్థానిక నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. సీఎంఆర్ ఎఫ్ – ఎల్ఓసి నుంచి రూ. 6 లక్షల 50 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ ఎఫ్ – ఎల్ఓసి పత్రాలను చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి తో కలిసి బాధిత కుటుంబాలకి అందచేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. హాఫిజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఆర్టీసి కాలనీకి చెందిన వెంకట భాస్కర రావుకి రూ. 2 లక్షల 50 వేలు, మియాపూర్ డివిజన్ పరిధిలోని డైనమిక్ కాలనీకి చెందిన మౌనికకు రూ. 2 లక్షలు, శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ కాలనీకి చెందిన శ్రీనిఖిల్ కుమార్ కి రూ. 2లక్షల మంజూరయ్యాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని తెలిపారు. వైద్య చికిత్సకి సహకారం అందించిన సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు, కాశినాథ్ యాదవ్, శ్రీనివాస్, సంపత్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here