- ఆకస్మికంగా సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్, కుమ్మరి బస్తీలో రూ. 25 లక్షల అంచనావ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు. తెల్లవారుజామున వరకు అక్కడే ఉండి పనులు చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మాదాపూర్ విలేజ్, కుమ్మరి బస్తీల దశా దిశ ను మార్చామని, అక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తామని, కాలనీ లో జరుగుతున్న రోడ్డు పనులను అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి తెల్లవారుజామున వరకు అక్కడే ఉండి స్వయంగా నాణ్యత ప్రమాణాలను పరిశీలించినట్లు తెలిపారు.
మాదాపూర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఏ ఈ జగదీష్, వర్క్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రవణ్ యాదవ్, రాజు యాదవ్, రవీందర్ ముదిరాజు, నర్సింగ్ యాదవ్, శాస్త్రి, గోపాల్, మహేష్, కిట్టు, యాదయ్య, శ్రీను, శ్రీహరి, ప్రేమ్, రాహుల్, సలీం, రాకేష్, సురేష్, రాము, నగేష్, కృష్ణ ,విష్ణు కాలనీ వాసులు పాల్గొన్నారు.