- అంకుర్ ట్రీ హౌస్ పాఠశాలలో విజ్ఞానశాస్త్ర ప్రదర్శనను సందర్శించి చిన్నారులను అభినందించిన కసిరెడ్డి భాస్కరరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: సైన్స్ ఫేర్ లు, క్రీడలను ప్రతీ పాఠశాల బాధ్యతగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. చందానగర్ లోని అంకుర్ ట్రీ హౌస్ పాఠశాలలో జరిగిన విజ్ఞానశాస్త్ర ప్రదర్శనను సందర్శించి మాట్లాడారు.

పాఠశాల కరస్పాండెంట్ జ్యోతితో కలిసి ఆయన చిన్నారుల నైపుణ్యాన్ని, ప్రదర్శనను చూసి ఇలాంటి ప్రదర్శనలు చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని అన్నారు. వారి ప్రతిభను, జిజ్ఞాసను వెలికితీసే ప్రయత్నం చేసిన ఉపాద్యాయులను, తల్లిదండ్రులను బిజెపి రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అభినందించారు.
