చందానగర్: చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రతీ కాలనీలో పూర్తిస్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని కార్పొరేటర్ నవతరెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని చందానగర్ ఫేస్ 2 కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్ పనులను గురువారం ఆమె కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత కొంత కాలంగా మెయిన్ రోడ్ గుంతలు ఏర్పడటం వలన వాహనదారులు ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు పిర్యాదు చేయడంతో సి.సి రోడ్ నిర్మించడం జరుగుతుందన్నారు. సి.సి రోడ్ పనులు ఎటువంటి జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేసి కాలనీ వాసులకు,వాహదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ రావు,రాజశేఖర్,భాస్కర్,ఉమ మహేశ్వర రావు, వంశీ,రేఖ దేవి,అమ్మాజీ,లక్ష్మీ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి…
చందానగర్ డివిజన్ లో నిధులు మంజూరైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని నవతరెడ్డి అధికారులకు సూచించారు. జిహెచ్ఎంసి ఈ. ఈ చిన్న రెడ్డి సమావేశమైన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అభివృద్ధి పనులపై చర్చించారు. దీప్తి శ్రీ నగర్ కాలనీ,జవహర్ కాలనీ,చందానగర్,భవాని శంకర్ నగర్, టెలీఫోన్ కాలనీ తదితర కాలనీ లలో సి.సి రోడ్లు నిర్మించడానికి నిధులు మంజూరైనoదున, పనులు త్వరగా మొదలు పెట్టి పూర్తి చేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు.