బీజేపీ విజ‌యం కోసం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కృషి చేయాలి: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, జూన్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పార్టీ పదవులలో నియమితులైన ప్రతి ఒక్కరు డివిజన్ సమస్యలపై, పార్టీ బలోపేతానికి తోడ్పడాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ సూచించారు. మసీద్ బండ కొండాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో లింగంపల్లి డివిజన్ ప్రభారి రామరాజు, కంటెస్టెంట్ కార్పొరేటర్ కర్చర్ల ఎల్లేష్, నియోజకవర్గ కో కన్వీనర్ మణిభూషణ్, డివిజన్ అధ్యక్షుడు భీమని కిషోర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ నూతన కార్యవర్గం ప్రకటన, వికసిత్ భారత్ లక్ష్యంపై కార్యశాల కార్యక్రమంలో ర‌వికుమార్ యాద‌వ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని నియమితులైన వారందరికీ నియామక పత్రాలు అందజేశారు. వికసిత్ భారత్ లక్ష్యం పై దిశానిర్దేశం చేశారు.

రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మన దేశంలో బీజేపీ అధికారాన్ని చేపట్టి 11 ఏళ్ల సుపరిపాలన పూర్తైన నేపథ్యంలో ప్రతి బూత్ లోనీ కార్యకర్తలు పర్యటించి మన ప్ర‌ధాని నేతృత్వంలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రెండురోజుల్లో రాబోయే యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతి డివిజన్, ప్రతి బూత్ లో నిర్వహించాలన్నారు. రాబోయే రోజుల్లో జరగబోయే జిహెచ్ఎంసి, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏ ఎన్నిక జరిగినా గెలుపే లక్ష్యంగా పనిచేసి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని కోరారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కాలనీ సమస్యలపై, ప్రజా సమస్యలపై అధికార పార్టీని ఎప్పటికప్పుడు అభివృద్ధి విషయంలో నిలదీస్తూ, అందరూ సమిష్టిగా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. డివిజన్ కు సంబంధించిన కమిటీలను, శక్తి కేంద్ర ఇన్చార్జిలను నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. డివిజన్ లో పదవులు చేపట్టిన ఉపాధ్యక్షులు కౌసల్య, అరుణ్ యాదవ్, రాజేష్, శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు అఖిల్, సురేష్, కార్యదర్శులు స్వాతి, లక్ష్మణ్, ఎల్లేష్, సిద్దు, కోశాధికారి సంజీవ్ రెడ్డికి, బాధ్యతలు చేపట్టిన డివిజన్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు రాజుశెట్టి, సీనియర్ నాయకులు రమేష్, సోమయ్య యాదవ్, నరసింహ,శాంతిభూషణ్ రెడ్డి, మారం వెంకట్, భరత్, ప్రభాకర్, విజయ లక్ష్మీ, మఖన్ సింగ్, జ్యోతి, అజయ్, సతీష్, నాగరాజు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here