తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించినపుడే అమరులకు నిజమైన నివాళి: బిజెపి

ఎమ్మార్వోకు మెమోరాండం సమర్పిస్తున్న బిజెపి నాయకులు

శేరిలింగంపల్లి: తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 న అధికారికంగా నిర్వహించినపుడే అమర వీరులను నిజమైన నివాళి అని శేరిలింగంపల్లి బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం శేరిలింగంపల్లి ఎమ్మార్వోకు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగనంద్, బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత నిజమైన చరిత్ర భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో బిజెపి 1998 నుండి పోరాటం చేస్తుందన్నారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఎందుకు విస్మరిస్తున్నారని వారు ప్రశ్నించారు.

భారత దేశానికి 1947 ఆగస్ట్ 15 న స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చిందని, నాటి కేంద్ర హోంశాఖ సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసోపేత పోలీస్ చర్య వల్ల నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కలిగిందన్నారు. నిజాం పాలనలో ఇక్కడి ప్రజలను ఎన్నో విధాలుగా అత్యాచారాలు, దోపిడీలకు గురిచేస్తు నియంతపాలనతో చిత్రహింసలు చేసారని, అలాంటి నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతం అంతా ఉద్యమంలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. స్వాతంత్య్రం అనంతరం తెలంగాణ ప్రాంతంలో జాతీయ జెండాను ఎగురవేయకుండా హింసించారని, జాతీయ జెండాను ఎగురవేసిన వందలాదిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. అలాంటి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ ఫలితంగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడిన తెలంగాణను సాదించుకున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ గత 22 సంవత్సరాలుగా తెలంగాణ విమోచన దినోత్సవం ను రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జరిపించాలని డిమాండ్ చేస్తుందని, నేటికి తెలంగాణ రాష్ట్రంలో విమోచన దినోత్సవం జరిపించకుండా తెలంగాణ అమరవీరులను ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వానికి మజ్లీస్ పై ఉన్న ప్రేమతో అమరవీరులను, వారి త్యాగాలను విస్మరిస్తూ నిజాం ప్రభువు వారసత్వానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. నియంత పాలనతో తెలంగాణ లో పూర్తిగా నిజాం పాలనను తలపించేలా పాలన సాగుతోందని, అమరవీరుల త్యాగాలకు స్ఫూర్తిగా విమోచన దినోత్సవం జరిపించి తీరాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్ లో బిజెపి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.

నియోజకవర్గ పార్టీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ మహిళ మోర్చా కార్యవర్గ సభ్యురాలు నర్రా జయలక్ష్మీ,
బీజెపి రాష్ట్ర నాయకులు నాగం రాజశేఖర్, రంగారెడ్డి జిల్లా నాయకులు మహిపాల్ రెడ్డి, గోవర్ధన్ గౌడ్, యువ మోర్చా రాష్ట్ర నాయకులు
చంద్ర మోహన్, డివిజన్ అధ్యక్షులు మానిక్ రావు, జయరాములు, యువమోర్చా అసెంబ్లీ కన్వీనర్ జితేందర్, బీజేపీ నాయకులు మారం వెంకటేష్, రాకేష్ దూబే, ఆంజనేయులు, అనిల్ గౌడ్, శాంతిభూషణ్ రెడ్డి, శివకుమార్, లక్ష్మణ్ ముదిరాజ్, రామకృష్ణారెడ్డి, కళ్యాణ్, వెంకటేష్, సురేష్ మట్ట, రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, సత్య, పవన్, యువమోర్చ నాయకులు శివకుమార్, రాము సదర్, నవాజ్ యాదవ్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here