శేరిలింగంపల్లి, జూన్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): JRC కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన జూబ్లీహిల్స్ శాసన సభ్యుడు దివంగత మాగంటి గోపినాథ్ దశ దినకర్మ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ దాసోజ్ శ్రావణ్ కుమార్, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి గోపీనాథ్ చిత్రపటానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మాగంటి గోపినాథ్ అకాల మరణం అత్యంత బాధాకరం అని, ఈ సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. అనారోగ్యంతో అయన మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందని అన్నారు. ఆయన లేని లోటు తీరనిది అని, మాగంటి కుటుంబ సభ్యులకు, శ్రేయభిలాషులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడుసుమిల్లి వెంకటేశ్వర రావు, పాతురి వెంకట్రావు, సాంబశివరావు, విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.