రాందేవ్ రావు ఆసుపత్రిలో మార్చురీ యూనిట్ ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, జూన్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్‌ప‌ల్లిలోని రాందేవ్ రావు ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రూ. 10 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన మార్చురీ యూనిట్ ను రాందేవ్ రావు కుమారుడు విక్రమ్ దేవ్ రావ్, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రూ. 10 లక్షలతో మార్చురీ యూనిట్ ప్రాంభించుకోవడం ద్వారా ఇక్కడి ప్రాంత వాసులకు ఉపయోగకరంగా ఉంటుంద‌ని అన్నారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రిలలో మాత్రమే ఉండే మార్చురీ యూనిట్ రామ్ దేవ్ రావు ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ డిస్ట్రిక్ గవర్నర్ శరత్ చౌదరి, చారటర్ ప్రెసిడెంట్ కిలారు వేణు బాబు , ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, సెక్రెటరీ శివరామకృష్ణ, డైరెక్టర్ కమ్యూనిటీ సర్విసెస్ విజయ్ భాస్కర్, డాక్టర్ యోబ్, నాయకులు సంజీవ రెడ్డి, MD ఇబ్రహీం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here