మాదాపూర్ డివిజన్ దాదాపు రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన
మాదాపూర్: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా సాగేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. మంగళవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానమెట్, ఇజ్జాత్ నగర్, నవ భారత్ నగర్, సైబర్ విలేజ్, సుభాష్ చంద్రబోస్ నగర్ , కృష్ణ నగర్ కాలనీ లలో 1 కోటి 93 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్లు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా అభివృద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో ప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకత్వంలో ,మంత్రి కేటీఆర్ సహకారం తో శేరిలింగంపల్లి నియోకజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదితానని గాంధీ పేర్కొన్నారు. అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు. అధికారులు డీఈ రూప దేవి, ఏఈ ప్రశాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ , డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్,హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్ తెరాస నాయకులు సాంబశివరావు,శ్రీనివాస్ గౌడ్,లక్ష్మారెడ్డి, ప్రసాద్,జంగయ్య యాదవ్ ,గుమ్మడి శ్రీను,జయరాజ్ యాదవ్, రాంచందర్,మధుసూదన్ రెడ్డి ,సత్య రెడ్డి బాబు మియా,అబ్దుల్ రెహ్మాన్,మియన్ పటేల్,నర్సింగరావు, కాజా,సాయి ఉమప్రభాకర్,విజయలక్ష్మి, సీత,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :
- మాదాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ విలేజ్ లో రూ.40 లక్షల అంచనా వ్యయం తో సీసీ రోడ్డు నిర్మాణ పనులు.
- మాదాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ నగర్ కాలనీ లో రూ.26 లక్షల అంచనా వ్యయం తో సీసీ రోడ్డు నిర్మాణ పనులు.
- మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో కాలనీ లో రూ.33.50 లక్షల అంచనా వ్యయం తో సీసీ రోడ్డు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు.
- మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానమెట్ లో రూ.26.లక్షల అంచనా వ్యయం తో సీసీ రోడ్డు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు.
- మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జాత్ నగర్ లో రూ.34.50 లక్షల అంచనా వ్యయం తో సీసీ రోడ్డు మరమ్మతు నిర్మాణ పనులు.
- మాదాపూర్ డివిజన్ పరిధిలోని నవభారత్ నగర్ లో రూ.33.50 లక్షల అంచనా వ్యయం తో సీసీ రోడ్డు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు.