నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్ ఫో లో వివిధ రాష్ట్రాలకి చెందిన చేనేత కళాకారులు ఆకట్టుకునే స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 10.30 నుండి రాత్రి 8 గంటల వరకు వివిధ రకాల చేనేత వస్త్రాలతో స్టాల్స్ అందుబాటులో ఉండనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ నాట్య గురువర్యులు కి .శే ముసునూరి ఇందిరా శిష్య బృందం వారి గురువు జయంతి సందర్బంగా నాట్య స్మృత్యంజలి ఘటించారు. మూషిక వాహన, వినాయక కౌతం, బ్రహ్మాంజలి, అదిగో అల్లదిగో, దీపాంజలి, బ్రహ్మమురారి, కుండా పై నృత్యం, కొలువైతివారంగా సాయి, దశావతారం, అల్లోనేరేళ్లో అంశాలను సాత్విక, యోగితా, ప్రణతి, జాహ్నవి, యుక్త, అక్షిత, సాహితి, వేదశ్రీ, భవాని, లక్ష్మి సహస్ర మొదలైన వారు ప్రదర్శించి నాట్య స్మృత్యంజలి ఘటించారు.