నమస్తే శేరిలింగంపల్లి: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం కేసీఆర్ కు చెంపపెట్టులాంటిదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్ అన్నారు. ఈటల గెలుపు సందర్భంగా లింగంపల్లిలో విజయోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించారు. బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచుకొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్బంగా నందకుమార్ యాదవ్ మాట్లాడుతూ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించడం పట్ల రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రావడం తథ్యమన్నారు. ఈటల గెలుపు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెంపపెట్టని అన్నారు. బాణాసంచా కాల్చి ఒకరికొకరు మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, నాయకులు మహిపాల్ రెడ్డి, రాఘవేందర్ రావు, స్వామిగౌడ్, కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.