ఇలా ప్రార్థన చేస్తే ఎటువంటి కోరికలైనా తప్పకుండా నెరవేరతాయి (వేదోక్తంగా)

కోరికలు లేని మనుషులు ఎవరూ ఉండరు. కోరికలు లేకుండా ఉండలనుకోవడం కూడా ఒక కొరికయే కదా..! మనిషి ఏదైనా ఆశించి భగవంతుడి దగ్గర మొర పెట్టుకుని కోరికలను ఫలింపజేసుకోడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో కొందరు సఫలీకృతమైతే కొందరు విఫలం చెందుతుంటారు.

సాధారణంగా పరీక్షల్లో పాసవ్వాలని, కూతురికో, కొడుక్కో పెళ్లి అవ్వాలని, సంతానం కలగాలని, మంచి ఉద్యోగం రావాలని, వ్యాపారంలో లాభాలు రావాలని, అనారోగ్యం నుండి బయట పడాలని ఇతరత్రా కోరికలతో చాలామంది ముడుపులు కట్టడం, మొక్కులు మొక్కడం చేస్తుంటారు. వారి వారి విశ్వాసాల ప్రకారం కోరికలు నెరవేర్చమని ఇష్టదేవుళ్లకు వేడుకోవడం సహజంగా చూస్తూనే ఉంటాం. మరి మన ధర్మానికి ఆధారమైన వేదం కోరికల విషయంలో ఏం చెబుతోంది. ఏ రకంగా ఎలాంటి కోరికలు కోరితే నెరవేరతాయి ఇప్పుడు చూద్దాం.

మనిషి తాను కోరుకున్నది సాధించాలి అంటే ముందుగా కావాల్సింది విశ్వాసం. సాధించగలను అనే సానుకూల దృక్పథం(positve thinking). మనం కోరుకున్న కోరికలను నెరవేర్చడంలో భగవంతుడు ఎమీ చేయడు, చేసేదంతా మనమే. పరీక్షల్లో పాసవ్వాలని ఒక విద్యార్ధి దేవుడిని వేడుకుంటాడు. ఆ కోరికను నెరవేర్చడానికి భగవంతుడు వచ్చి పరీక్ష రాయడు కదా…! మనం చేసే ప్రార్థనల ఫలితంగా మన కోరికలను నెరవేర్చడానికి చేసే ప్రయత్నానికి పరమాత్ముడు తన శక్తిని అందిస్తాడు. ఆ శక్తినే మనం కోరుకుంటే జీవితంలో మనకు కావాల్సింది ఏదైనా సులభంగా సాధించుకోవచ్చు.

వేదం జ్ఞానం అంతా మనకు మంత్రాల రూపంలో ఉంటుంది. మంత్రం అంటే మననం(పఠించే) చేసే వారిని రక్షించేది అని అర్థం. వేద మంత్రాలను అర్థం చేసుకుని నిత్యం వాటిని పఠించడం ద్వారా మనలో ఆత్మశక్తి పెంపొంది మనం చేసే ప్రతీ పనిలో తప్పక విజయం సాధిస్తాము. అటువంటి మంత్రాలలో శక్తిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించే మంత్రాలు కొన్ని చూద్దాం.

ఓం తేజోసి తేజోమయి దేహి.  హే పరమాత్మ నీవు అనంతమైన జ్ఞానంతో కూడిన తేజస్సు కలిగి ఉన్నావు. నాకు ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించుము.

వీర్యమసి వీర్యమ్‌ మయి దేహి  హే పరమాత్మను నీవు కలిగి ఉన్న అనంతమైన పరాక్రమమును మాకు ప్రసాదించుము

బలమసి బలం మయి దేహి  అనంత బలయుక్తుడవైన ఓ పరమాత్మ మాకు శారీరక, మానసిక, ఆత్మిక బలాలను ప్రసాదించుము

ఓజోసి ఓజోమయి దేహి  అనంతమైన సృష్టి రచన చేసిన ఓ పరమాత్మ సామర్ధ్యములో నిన్ను మించిన వాడు లేడు. మాకు ఆ సామర్ధ్యాన్ని ప్రసాదించుము.

మన్యురసి మన్యుం మయి దేహి  చెడ్డవారి పట్ల, చెడు పనుల పట్ల నీవు క్రోధకారివి(కోపం చూపించువాడవు) మాకు కూడా అటువంటి క్రోధాన్ని అందించుము.

సహోసి సహామయి దేహి దేవదేవా అపరాదుల పట్ల, నిర్దోషుల పట్ల నీవు సహనం వహిస్తావు. అటువంటి సహనాన్ని మాకు ప్రసాదించుము.

పైన తెలిపిన ఆరు మంత్రాలు ద్వారా పరమాత్మను ప్రార్థించి శక్తిని పొందగలిగితే జీవితంలో ఎలాంటి సమస్యనైనా సులువుగా అధిగమించవచ్చు.

మనిషి కోరవలసిన కోరికలు ఇవే

ఓం స్తుతా మయా వరదా వేదమాతా
ప్రచోదయంతాం పావమానీ ద్విజానామ్ ||
ఆయుః, ప్రాణం, ప్రజాం, పశుం, కీర్తిం, ద్రవిణం,
బ్రహ్మవర్చసమ్ మహ్యందత్వా ప్రజత బ్రహ్మలోకమ్ | (అథర్వవేదం 19-71-1)

అర్ధం: లోకములను పాలించు వేదమాతయైన పరమేశ్వరుని మేము అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్ధించుచున్నాము. వరముల నిచ్చు దివ్యమైన ఆ వేదమాత మాకు ఆరోగ్యప్రదమైన ఆయువును, దృఢమైన ప్రాణశక్తిని, సంస్కారవంతమైన సంతానమును, శుభప్రదమైన పాడిపశువులను, ప్రశస్తమైన యశస్సు, కీర్తిని, న్యాయార్జితములైన ధనములను, విశేషమైన బ్రహ్మజ్ఞానమునిచ్చి నిరంతరము మమ్ములను సన్మార్గమున, స్వస్తి మార్గమున ఆచరించుచు జీవించెదముగాక !

పైన తెలిపిన ప్రార్థనలు మనకోసం మనం పరమాత్ముని ప్రార్థించేవి. ఇక దీనితో పాటుగా లోక కల్యాణం కోసం కూడా ప్రార్ధించడం మన బాధ్యతే. ఎందుకంటే మనం మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్ధం. స్వార్థపూరితమైన కోరికలు ఎన్నటికీ సిద్దించవు. సమాజంలో అందరూ బాగుంటేనే కదా అందులో ఉండే మనం బాగుపడటానికి వీలవుతుంది. అందుకే లోక కళ్యాణార్థం కూడా ప్రతిరోజూ తప్పక భగవంతుని ప్రార్థించాలి.

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః ౹ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్భవేత్ ౹౹. కాలే వర్షతు పర్జన్య: పృథివీ సస్యశాలినీ౹ లోకో యం క్షోభ రహితః సజ్జనాస్సంతు నిర్భయా: ౹౹ స్వస్తి ప్రజాభ్య: పరిపాలయన్తా౦ న్యాయేన మార్గేన మహీం మహీశా: గోబ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం లోకా స్సమస్తా సుఖినో భవన్తు౹౹

లోకంలోని ప్రజలందరూ సర్వులు సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక. సర్వులు ఎ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక. అందరికీ ఉన్నతి కలుగు గాక. ఎవరికీ బాధలు లేకుండు గాక. మేఘాలు సకాలములో కురియు గాక. భూమి సస్య స్యమలమై పండు గాక. దేశము లో ఏ బాధలు లేకుండు గాక. బ్రాహ్మణులూ, వారి సంతతి నిర్భయులై సంచరించెదరు గాక. ప్రజలకు శుభము కలుగు గాక. ఈ భూమిని పాలించే ప్రభువులందరూ న్యాయ మార్గం లో పాలింతురు గాక. గోవులకు, బ్రాహ్మణులకు శుభము కలుగు గాక. జగతి లోని సర్వ జనులందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లెదరు గాక.

సనాతన ధర్మంలో తెలిపిన విషయాలను నేటి తరం పిల్లలకు నేర్పించడం మన బాధ్యత. మన ధర్మం కోసం మన బాధ్యతను నిర్వర్తిద్దాం. ధర్మో రక్షతి రక్షితః ?

Advertisement

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here