- ప్రత్యేక పూజలు చేసిన ఆలయ ఆచార్యులు
నమస్తే శేరిలింగంపల్లి: చందనగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో హనుమత్ జయంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 5.45 ని లకు సుప్రభాత హారతి, 6.30 ని లకు నిత్యా అర్చనలు, 7.30 ని లకు బాలబోగం నివేదనహారతి, 8 గం నుండి ప్రత్యేక హోమము 10 లకు పూర్ణాహుతి, 10.15 ని నుండి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తర శతకలశము(108)లు పంచామృతములు డ్రై ఫ్రూట్స్ వివిధ రకాల పండ్ల రసాములతో లేతకొబ్బరిజలములతో మహాఅభిషేకం విశేష పుష్పాలంకారం హారతి, 11.30 ని ల నుండి సామూహికంగా లక్ష సింధురార్చన 12.30 ని లకు మహానివేదన నిర్వహించారు. అంతేకాక వేదపండిత సత్కారం, మూడు రోజులు దీక్ష వహించిన దాతలు ఆలయ ఉపాధ్యక్షుడు టర్భో ఇండస్ట్రీ అధినేత తోట సుబ్బారాయుడు, వారి కుమార్తె, అల్లుడు బాలసురేష్ బాబు చందనలకు వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. స్వామి వారి శేషవస్త్రాలతో సత్కారం పొందారు. హారతి తీర్ధ ప్రసాధవియోగం తదనంతరం అన్నప్రసాధ వితరణతో హనుమద్ జయంతోత్సవాలు ఎంతో ఘనంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకబృందం, ఆలయ ప్రధానఅర్చకులు సత్యసాయి, ఆచార్యులు ఆంజనేయ స్వామి, ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, శివకుమార్, పవన్ కుమార్, రవిశర్మ, రమేష్ శర్మ, నరేంద్ర శర్మ, ఆలయ కార్యవర్గ సభ్యులు, ఆలయ అధ్యక్షులు కే. రఘుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు తోట సుబ్బారాయుడు కోశాధికారి అశోక్ కుమార్, సభ్యులు వెంకటశేషయ్య, నాగేశ్వరరావు, బ్రహ్మయ్యగుప్తా, రాంగోపాల్, దేవాలయసేవాసమితి సభ్యులు , పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభయాంజనేయ స్వామి వారి తీర్ధ ప్రసాధములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారుహనుమత్ జయంతోత్సవం .