హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): ప‌్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్‌ల ఆదేశాల మేరకు మంగళవారం హఫీజ్ పేట డివిజన్ వార్డు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డు మెంబర్ దొంతి శేఖర్ ముదిరాజ్, ఏరియా కమిటీ మెంబర్ రవికుమార్, తెరాస పార్టీ ఎస్సీ నాయకుడు కంది జ్ఞానేశ్వర్, నాయకులు భగత్ ముదిరాజ్, కంది చిన్నా, దొంతి గోపి ముదిరాజ్, అనిల్, రవి, ప్రవీణ్, వలీ, వీరేందర్, వెంకట్, శ్రీనివాస్, టీఆర్ఎస్‌వీ నాయకులు రాచమళ్ల విశ్వేశ్వర్ రెడ్డి, శివ ముదిరాజ్, హరీష్, జి.రోహిత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదుపై చర్చించారు. తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. 2017 కి ముందు డిగ్రీ ఉత్తీర్ణులైన వారిని పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేయించాలని అన్నారు.

