నిద్రలేమి సమస్య ప్రస్తుతం చాలా మందిని బాధిస్తోంది. రాత్రిళ్లు చాలా మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. బెడ్ మీద పడుకున్నాక ఒక పట్టాన నిద్ర పట్టదు. దీంతో ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఇందుకు డాక్టర్ వెయిల్స్ సూచించిన 4-7-8 అనే బ్రీతింగ్ టెక్నిక్ చక్కగా పనికొస్తుంది. అందుకు ఏం చేయాలంటే..?
* 4 సెకన్ల పాటు శ్వాసను అలాగే పీల్చాలి.
* 7 సెకన్ల పాటు ఊపిరిని అలాగే బిగపట్టి ఉండాలి.
* 8 సెకన్ల పాటు శ్వాసను వదలాలి.
పైన తెలిపిన టెక్నిక్‌ను నిద్రకు ఉపక్రమించేటప్పుడు కొన్ని సార్లు చేయడం వల్ల సులభంగా నిద్ర పడుతుంది. అయితే ఈ టెక్నిక్ సమర్థవంతంగా పనిచేయాలంటే ఏకాగ్రత ఉండాలి. ఇతర ఏ విషయాలపై దృష్టి నిలపరాదు. కేవలం శ్వాస మీదే దృష్టి ఉంచాలి. దీంతో మనస్సు ప్రశాంతంగా మారి రిలాక్స్ అవుతారు. ఫలితంగా నిద్ర త్వరగా పడుతుంది. అయితే ఈ టెక్నిక్ అందరికీ పనిచేయాలని ఏమీ లేదు. కానీ.. ట్రై చేస్తే నిద్రలేమి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.