నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో గురు పౌర్ణిమ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ కథక్, విలాసిని నృత్య గురువర్యులు సంజయ్ కుమార్ జోషి గురుపూజోత్సవం నిర్వహించారు.
కూచిపూడి భరతనాట్యం, కథక్ , ఒడిస్సి, విలాసిని నాట్య ప్రదర్శనలు కళాకారులు ప్రదర్శించారు. వారి గురువులను ఘనంగా సత్కరించారు. విలాసిని నాట్యం గణపతి ప్రార్థనతో సంజయ్ జోషి ప్రారంభించారు భరతనాట్యం గురువర్యులు ప్రమోద్ రెడ్డి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో పుష్పాంజలి, మార్గం, భజన అంశాలను ప్రదర్శించారు. ఒడిస్సి నృత్య ప్రదర్శనలో రీబ్దిత, సంజుక్త ఘోష్ అభినయ అంశాన్ని ప్రదర్శించారు. ఖలీల్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో లోఖాయెహ్ బాలకృష్ణన్, అన్నమాచార్య కీర్తన, త్రినేత్రం అంశాలను ప్రదర్శించారు. కథక్ నృత్య ప్రదర్శనలో సంజయ్ జోషి గురువందనా, కృష్ణ తత్వ అంశాలను ప్రదర్శించారు.