డిఎస్ఆర్ ఫార్చునర్ అపార్ట్మెంట్స్ వ‌ద్ద డ్రైనేజీ స‌మస్య ప‌రిష్కారం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ డిఎస్ఆర్ ఫార్చునర్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో వారి ఆహ్వానం మేరకు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పలు సమస్యల‌ను కార్పొరేటర్ హమీద్ పటేల్ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో చాలా సంవత్సరాల నుండి ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను హమీద్ పటేల్ దృష్టికి తీసుకు రాగానే అప్పటికప్పుడు సత్వర చర్యలు తీసుకుని పరిష్క‌రించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ కి అభినందనలు తెలియజేసి సత్కరించారు.

స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్‌ను కోరుతున్న డీఎస్ఆర్ ఫార్చున‌ర్ వాసులు

ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ త‌న‌ దృష్టికి వచ్చిన పలు సమస్యలు పై ప్రత్యేక శ్రద్ద పెట్టి సత్వరమే పరిష్కరిస్తామని అసోసియేషన్ సభ్యులకు తెలియజేశారు.ఈ కార్య‌క్ర‌మంలో సీనియర్ నాయకుడు కావూరి రాజేశ్వర్ రావు, ఏరియా కమిటీ సభ్యుడు కుమ్మరి సిల్వర్ శ్రీనివాస్, యూత్ నాయకుడు అబ్దుల్ వసీమ్, డిఎస్ఆర్ ఫార్చునర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాల‌ గంగాధర్ రెడ్డి, రవి రాజు, రవీందర్ నాథ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here