శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసుల నేతృత్వంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో కార్యనిర్వాహకుడు సుధీష్, కాలనీ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు వేడుకల్లో బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రమేష్, డబుల్ బెడ్రూమ్ కాలని అసోసియేషన్ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.